top of page

దైవత్వమును విడమరచుట: ఒక్క దేవుడా లేదా ముగ్గురా?

దైవత్వమును అర్థము చేసుకొనుటలో గల ప్రయాసములు

బైబిలు ఒక్క దేవుడు ఉన్నాడని చెబుతుందా లేక ముగ్గురు ఉన్నారని చెబుతుందా? ఈ కష్టమైనా ప్రశ్న బైబిలు యొక్క మొదటి వచనము నుండే కలిగినది. ఆదికాండము 1:1 ఇలా చెబుతుంది, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”  బైబిలు యొక్క మూల భాషలో, “దేవుడు” అనేది బహువచనములో ఉన్న నామవాచకము, మరియు “సృష్టించుట” అనేది ఏకవచనములో ఉన్న క్రియాపదము. అయితే, అది ఏమిటి? ఆదియందు సర్వశక్తిమంతుడైన నిత్యుడైనటువంటి ఒక్కడే ఉండి అన్నింటిని సృష్టించాడా లేదా సమస్తమును సృష్టించుటలో అనేకమైన సర్వశక్తిగల వ్యక్తులు దీనిలో ఉన్నారా? ఒక వైపు మనకు ఈ విధముగా చెప్పే యెషయా 44:24 వంటి వచనములు ఉన్నాయి, “గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను?’” మరో వైపు, మనకు యోబు 33:4 మరియు హెబ్రీయులకు 1:2 వచనములు ఉన్నవి, ఇవి సృష్టిలో వేరేవారు కూడా ఇమిడియున్నారని చెప్పుచున్నాయి. యోబు 33:4 ఇలా చెప్పుచున్నది, “దేవుని ఆత్మ నన్ను సృజించెను [సర్వశక్తుని] యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను,” హెబ్రీయులకు 1:2 ఇలా చెప్పుచున్నది, “ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” జవాబు అనేది రెండు విధములుగా ఉన్నట్లు మనకు బైబిలు నుండి కనిపిస్తుంది. సమస్తమును సృష్టించిన దేవుడు ఒక్కడు మాత్రమే. అయితే, ఈ ఒక్క దేవుడు మూడు విభిన్న వ్యక్తిత్వాలను కలిగియున్నాడు. నేను ఇంకా దీనిని ముందుకు కొనసాగించి వివరిస్తాను.


ఒక్క దేవుడు

ప్రాచీన కాలాల్లో, యేసుకు ముందు, ఇశ్రాయేలీయులు ఆచరణాత్మకంగా ఒకే దేవుని లేదా సర్వశక్తిమంతుడైన దేవుడుని మాత్రమే ఆరాధించే ఏకైక దేశం. పాత నిబంధన గ్రంథాలలో, ఆయన తన వ్యక్తిగత పేరైన, “యెహోవా” అనే పేరు ద్వారా ఎక్కువగా పిలువబడ్డాడు, ఇది “నేను” అనే హెబ్రీ పదబంధం యొక్క నిర్వచనం.


యెహోవా తన స్వభావం మరియు లక్షణములో సృష్టించబడిన సమస్త జీవుల కంటే పైగా ఉన్నాడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అని పిలువబడేవాడు. ఇతర శక్తివంతమైన జీవులు కూడా ఉన్నాయి. అసలు బైబిల్ భాషలో, “దేవుడు” అంటే “సర్వశక్తిమంతుడు” అని అర్థం. ఈ కోణంలో, అనేక శక్తివంతమైన ఆత్మసంబంధమైన జీవులు లేదా దేవతలు ఉన్నారు. మనం వారిని దేవదూతలు మరియు అపవాదులు అని కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, మానవులను దైవములు అని కూడా పిలుస్తారు (కీర్తనలు 82:6) ఎందుకంటే వారు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డారు. అయితే, సమస్తమైన ఇతర శక్తివంతమైన జీవులను సృష్టించిన సర్వశక్తిమంతుడైన నిత్యుడైనా దేవుడు ఒకడు మాత్రమే ఉన్నాడు. ఆయన పేరు యెహోవా.


బైబిల్ బోధించేది యెహోవా ఒక్కడే అని , మరియు ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒకే ఒక దైవిక స్వభావం ఉంది. అతడు సర్వశక్తిమంతుడు. అతడు నిత్యుడు . ఆయన ఖచ్చితంగా న్యాయంగా ఉన్నాడు, ఆయన తీర్పులో కఠినంగా ఉంటాడు, కానీ ఆయన దయ మరియు ప్రేమలో అసమానుడుగా ఉంటాడు. ఆయన ఎక్కడికైనా వెళ్లగలడు మరియు ఒకే సమయంలో ప్రతిచోటా ఉండగలడు. ఆయన అన్నిటినీ సృష్టించాడు, మరియు ఆయన తన చిత్తంతో అన్నిటినీ నిలబెట్టుకుంటాడు. ఇలా ఒక్కడే ఉన్నాడు. అందుకే దేవుడు ఒక్కడే అని బైబిల్ బోధిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6:4 ఇలా చెబుతోంది, “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.”


బైబిలు యొక్క దేవుని గూర్చి అనేకులు ఆలోచన చేసినప్పుడు, వారు యెహోవాను తండ్రిగా ఆలోచన చేస్తారు. వాస్తవానికి ఎఫెసీ. 4:6 ఇలా చెప్పుచున్నది “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.” ఏది ఏమైనప్పటికీ, పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి కంటే యెహోవా తనను తాను వివిధ రూపాల్లో మానవాళికి సమర్పించుకుంటాడని గమనించడం ముఖ్యం. ఉదాహరణకు, ఆదికాండము 18లో, అబ్రాహాము ముగ్గురు వ్యక్తులు తన గుడారానికి చేరుకోవడం చూశాడు. 17-21 వచనములలో, తను మాట్లాడుతున్న మనుష్యులలో ఒకడు మానవ రూపంలో ఉన్న యెహోవా అని వెంటనే తెలుసుకుంటాడు! యెహోవా తనతో కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఆ సమయములో పరలోకములో ఉన్న తండ్రి ఉనికి కోల్పోయాడా లేదా అస్థిరమైన స్థితిలో ఉన్నాడా? కాదు. యెహోవా అబ్రాహాముతో మాట్లాడడం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క చిన్న రూపమును సూచిస్తుందా? కాదు. యెహోవా తాను ఎంచుకున్నన్ని రూపాల్లో ఒకేసారి ప్రతిచోటా ఉండగలడు (యిర్మీయా 23:23-24). ఆయన ఒకే సమయములో పరలోకమందు ఆత్మీయ రూపంలో మరియు భూమిపై మానవ రూపంలో ఉండగలడు. యెహోవా పరలోకములో తండ్రి అయిన దేవుడు కాకుండా ఇతర సమానమైన రూపాలను తీసుకోగలడు.


మూడు విభిన్న వ్యక్తిత్వములు

విభిన్న రూపాలు లేదా యెహోవా యొక్క ప్రత్యక్షతలు గురించి ఆలోచించే బదులు, అది సాధ్యమే, మరియు అనేక సందర్భాల్లో యెహోవాను విభిన్న వ్యక్తిత్వంగా భావించడం మంచిది. “రూపం” మరియు "ప్రత్యక్షత" అనే పదాలు మానవజాతికి తాత్కాలిక ప్రదర్శనను మాత్రమే సూచిస్తాయి. అయితే, బైబిల్ యెహోవా యొక్క మూడు క్రియాత్మక వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతుంది. అనగా, ముగ్గురు విభిన్న వ్యక్తులు యెహోవానే, మరియు నిత్యత్వము అంతటా యెహోవా యొక్క ప్రతి స్వయం ఉనికి వ్యక్తిత్వం కలిగియున్నారు. ఇది "ముగ్గురు దేవుళ్ళు" అని చెప్పడానికి సమానం కాదు, ఎందుకంటే వ్యక్తిగత దేవుళ్ళ ఆలోచన సాధారణంగా స్వతంత్ర మరియు కొన్నిసార్లు పోటీ సంకల్పాలతో వేరు వేరు శక్తివంతమైన జీవులను సూచిస్తుంది. కవల తోబుట్టువులు, ఉదాహరణకు, సారూప్యమైన కానీ భిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉండవచ్చని చెప్పడం కూడా పోల్చదగినది కాదు. తోబుట్టువులు ఇప్పటికీ అనేక విధాలుగా విభిన్నంగా ఉన్నారు. మరోవైపు, యెహోవా మనం ఊహించుకునే దేవుళ్లలా లేదా మనుషుల్లా కాదు. ఆయన ఒక స్వభావం, పాత్ర మరియు సంకల్పం కలిగి ఉంటాడు, కానీ ఆయన మూడు వేర్వేరు వ్యక్తిత్వాలుగా ఒకే సారాన్ని కలిగి ఉంటాడు.


తండ్రి

మనం ఇంతకుముందే చర్చించుకున్న యెహోవా యొక్క బాగా అర్థం చేసుకోబడిన వ్యక్తిత్వం తండ్రి అయిన దేవుడు. పాత నిబంధన తరచుగా యెహోవా యొక్క తండ్రి స్వభావాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఆయన సృష్టికర్త మరియు సర్వాధికారి, ఆయన ప్రజలను, ఆయన పిల్లలను కూడా సన్నిహితంగా చూసుకుంటాడు. ద్వితీయోపదేశకాండము 32:6 ఇలా చెబుతోంది, “ఆయన [యెహోవా] నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.”


కుమారుడు

బైబిలు యెహోవా, దేవుడు లేదా ప్రభువు అనేదానిని సూచిస్తున్నప్పుడు, అది ప్రత్యేకముగా తండ్రిని సూచిస్తున్నట్లు అనేకులు ఊహించుకుంటారు. అయితే, ఇక్కడ ఇది కాదు విషయము. తరువాత యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా యెహోవాకు మరొక వ్యక్తిత్వం ఉందని మనము తెలుసుకుంటాము. యోహాను 1:1,14 మరియు 18లో ఇలా చెప్పబడింది, “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ... ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ... ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.” ఎల్లప్పుడూ ఉనికిలో  మరియు సమస్తమును సృష్టించినవాడు వాక్యమైన యేసుక్రీస్తును సూచిస్తుంది . ఆయనే దేవుడైన యెహోవా యొక్క రెండవ శాశ్వతమైన వ్యక్తిత్వము. ప్రకటన 1:8లో యేసు తనను గూర్చి ఇలా చెప్పుకుంటాడు, “అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.”


యేసు ప్రత్యేకమైనవాడు ఎందుకనగా ఆయన పూర్తిగా దైవత్వం గలవాడు మరియు పూర్తిగా మానవుడు. కొలస్సయులకు 2:9 ఇలా చెప్పుచున్నది, “ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;” ఈ వచనములో ఆసక్తికరమైన విషయము ఏమనగా యేసు శరీర రూపములో నివసిస్తున్నట్లు (వర్తమాన కాలము) సూచిస్తుంది. ఆయనకు దేవత్వము, నిత్యము ఉంటుందని అర్థమవుతుంది. మరియు ఆయన శరీర రూపమును దాల్చాడు. ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు (యోహాను 20:27), ఆయన పరలోకానికి తిరిగి ఆరోహణము అయ్యేవరకు కూడా ఆ పునరుద్దాన శరీరమును కలిగియున్నాడు. ఇది యెహోవా యొక్క ప్రత్యేక వ్యక్తిత్వాలను మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం పరలోకంలో, యేసు శరీర రూపంలో తండ్రి కుడి వైపున కూర్చున్నాడు. క్రీస్తు కూడా ఆత్మ అయినప్పటికీ (2 కొరిoథీ. 3:17), ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన దేవునిలోనికి కేవలం "శోషించబడలేదు". అతను విభిన్నంగా ఉంటాడు. హెబ్రీయులు 1:3 ఇలా చెబుతోంది, "ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.”


పరిశుద్దాత్ముడు

బైబిలు నందు వివరించబడిన యెహోవా యొక్క మూడవ వ్యక్తిత్వము పరిశుద్ధాత్మ. యేసు బాప్తిస్మమునందు, పరిశుద్ధాత్మ తండ్రి నుండి కుమారుని మీదకి పావురము రూపములో దిగివచ్చి ఇలా చెప్పుట మనము గమనిస్తాము, “మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (మత్తయి 3:17). ఇక్కడ మనం యెహోవా యొక్క మూడు వ్యక్తిత్వాల సూచనను స్పష్టంగా చూడవచ్చు.


ఆయన తండ్రితో ఉండుటకు పరలోకముకు ఆరోహణం కాకముందు, సహాయకుని పంపుతానని వాగ్దానము చేసాడు, అదే సత్యస్వరూపియగు ఆత్మ (యోహాను 14:16-17). యేసు తన శిష్యులతో మాట్లాడుతూ, యేసు తండ్రితో ఉన్నాడని మరియు అదే సమయములో ఇప్పటికీ వారితో ఆత్మ ద్వారా ఉంటాడని చెప్పాడు (యోహాను 14:19-20). దీని అర్థం ఏమిటంటే, యేసు తన శిష్యులను అనాథలుగా విడిచిపెట్టడు (యోహాను 14:18). యెహోవా యొక్క మూడవ వ్యక్తిత్వం - పరిశుద్ధాత్మ - నేటికీ సంఘములో ఆయన ప్రజలతో ఉన్నాడు.


పాత నిబంధనలో, యెహోవా యొక్క ఆత్మ వారి నియమించబడిన దేవాలయం (లేదా గుడారం) ద్వారా ప్రజలతో తన ఉనికిని వ్యక్తం చేసింది. కొన్ని సమయాల్లో, ప్రజలు యెహోవా మహిమ వారిని రక్షిస్తూ వారిని నడిపించడాన్ని చూడగలిగారు (యెషయా 63:7-14). అదే విధంగా, ఇప్పుడు యేసును తమ రక్షకుడిగా మరియు దేవుడుగా గుర్తించే వ్యక్తులు పరిశుద్ధాత్మ వారిని రక్షించి, నడిపిస్తున్నాడు (ఎఫెసీయులకు 3:16; 6:17) అని తెలుసుకుంటారు. యెహోవా క్రైస్తవునితో ఉన్నాడని దీని అర్థం. ఆయన తండ్రి మరియు యేసుతో ఏకకాలంలో పరలోకంలో ఉన్నాడు మరియు  ఆయన క్రైస్తవుడితో ఉన్నాడు. ఆయన ముగ్గురు విభిన్న వ్యక్తిత్వాలు కలిగియున్నాడు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ సంకల్పం మరియు ఉద్దేశ్యంలో పూర్తిగా ఏకీకృతమై ఉన్నారు మరియు ముగ్గురూ పూర్తిగా సర్వశక్తిమంతుడైన దేవుడు.


ఒక దేవుడు మరియు మూడు వ్యక్తిత్వాల యొక్క ప్రాముఖ్యత

నిరీక్షణ కలిగి, సర్వశక్తిమంతుడైన మరియు సర్వాధికారియైన దేవుడు ఒక్కడే ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనం అభినందించగలము. అనగా వ్యక్తిగత వివేచనకు ఆస్కారం లేదు. బైబిల్లో వెల్లడి చేయబడిన రీతిగా ఆయన స్వభావం మరియు గుణము పరిపూర్ణమైనది మరియు సాటిలేనిది. దైవిక స్వభావాన్ని అనేక పోటీ దేవతల రూపంలోకి తగ్గించడం ద్వారా ప్రతి ఒక్కరికి వేర్వేరు శక్తులు మరియు వేరు వేరు ప్రభావాలు ఉంటాయి అనే భావన కలిగి మానవజాతి తనను తాను బాధించుకుంటుంది. ప్రపంచం ఊహించిన దేవుళ్ళు సాధారణంగా దూరంగా మరియు చపలచిత్తులుగా ఉంటారు. మరోవైపు, బైబిల్, యెహోవా మన జీవితానికి మరియు ఉనికికి చాలా దగ్గరి మూలం అని మాట్లాడుతుంది మరియు ఆయన మనలో ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు (అపొస్తలుల కార్యములు 17:27-28)!


యెహోవా యొక్క మూడు వ్యక్తిత్వాలు మానవజాతితో సాన్నిహిత్యం అనే ఆలోచనను మాత్రమే బలపరుస్తాయి. పరలోకంలో ఉన్న తండ్రి మన అవసరాలన్నిటినీ తెలుసుకొని వాటిని సమకూర్చుతున్నట్లు అర్థమవుతుంది (మత్తయి 6:8, 30). దేవుని కుమారుడగు యెహోవాయే యేసు వలె శరీరములో భూమిపైకి వచ్చినవాడు. మనిషిగా ఎలా ఉండాలో ఆయన అనుభవించాడు. ఈ కారణంగా, ఆయన మన నమ్మకమైన మరియు దయగల ప్రధాన యాజకునిగా సానుభూతితో సేవ చేయగలడు. ఆయన శరీరధారిగా జీవించాడు మరియు మరణం అనుభవించాడు మరియు ఆయన దానిని జయించాడు. ఇప్పుడు, ఆయన మన తరపున మన మరణాన్ని జయించగలడు మరియు మన కొరకు తండ్రి యొద్ద వాదించగలడు (హెబ్రీయులు 2:14-18). ఆత్మ కూడా యెహోవా యొక్క దైవిక ప్రతినిధి, ఆయన నేటికీ క్రైస్తవునిలో జీవిస్తున్నట్లు వివరించబడింది (రోమన్లు ​​8:15). ప్రతి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు పూర్తిగా దేవుడు మరియు ఒక పనిలో ఏకీకృతం అయ్యారు.అదేమనగా నశించిపోయిన మరియు పోరాడుతున్న పాపిని తిరిగి యెహోవా వద్దకు తీసుకురావడం.

Comments


bottom of page